Abn logo
Sep 24 2021 @ 10:34AM

HYD: నిమ్స్‌లో మహిళకు అరుదైన గుండె సర్జరీ

ఒకేసారి మూడు వైద్య ప్రక్రియలు

హైదరాబాద్‌ సిటీ: నిమ్స్‌లో మహిళకు అరుదైన గుండె సర్జరీ చేశారు. ఒకేసారి మూడు వైద్య ప్రక్రియల ద్వారా చికిత్స అందించారు. కామారెడ్డికి చెందిన బాలామణి (56) తీవ్ర ఆయాసం, నడవలేని పరిస్థితిలో నిమ్స్‌ ఆస్పత్రికి వచ్చినట్లు కార్డియాలజిస్టు డాక్టర్‌ సాయి సతీష్‌ తెలిపారు. పరీక్షించిన వైద్యులు గుండె అతివేగంగా కొట్టుకోవడంతో పాటు ఎడమ గుండె కవాటం మూసుకుపోయినట్లు గుర్తించారు. ఆరు నెలలుగా ఆమె ఈ సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఒకే సారి గుండె కవాటాన్ని తెరవడం, రక్తం ప్రసరణలో అవరోధాలు తొలగించడం, రేడియో ప్రీక్వెన్సీని తగ్గించడం.. ఇలా మూడు ప్రక్రియల ద్వారా చికిత్స అందించామని, ఇది చాలా అరుదైన శస్త్ర చికిత్స అని సతీష్‌ చెప్పారు. ఈ నెల 17న మూడు గంటల పాటు జరిగిన ఈ వైద్య ప్రక్రియ విజయవంతమైందని, ఒకటి, రెండు రోజులలో ఆమెను డిశ్చార్జి చేస్తున్నామనీ తెలిపారు. 

హైదరాబాద్మరిన్ని...