ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు గుండె ఆపరేషన్లు

ABN , First Publish Date - 2021-03-08T06:52:59+05:30 IST

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స విభాగం (సీటీ సర్జరీ)లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు గుండె బైపాస్‌ ఆపరేషన్లు నిర్వహిస్తామని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.జి.నరేంద్రనాథ్‌ రెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.సి. ప్రభాకర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు గుండె ఆపరేషన్లు

  1. కర్నూలు జీజీహెచ్‌కు అనుమతి 


కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 7:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స విభాగం (సీటీ సర్జరీ)లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు గుండె బైపాస్‌ ఆపరేషన్లు నిర్వహిస్తామని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.జి.నరేంద్రనాథ్‌ రెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.సి. ప్రభాకర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌గా ఓపీలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. సిటీ సర్జరీ ఓపీలు ప్రతి సోమ, గురువారాల్లో ఉంటాయన్నారు. ఈహెచ్‌ఎస్‌ వార్డు కింద ఉద్యోగులకు క్యాష్‌లెస్‌ సదుపాయాలతో ఏ మాత్రం పైసా ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వమిస్తామన్నారు. గత నాలుగేళ్ల క్రితం 10 కోట్లతో నిర్మించబడిన రీజినల్‌ సిటీ సర్జరీ విభాగాన్ని ప్రారంభించారు. ఇక్కడ అమెరికా తరహాలో రెండు అత్యాధునిక మాడ్యులర్‌ ఓటీలు, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కోడింగ్‌, ఐసీయు, స్టెప్‌డౌన్‌ వార్డులు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఇక్కడ 400 బైపాస్‌ సర్జరీ ఆపరేషన్లు చేశామని తెలిపారు. 

Updated Date - 2021-03-08T06:52:59+05:30 IST