Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవిడ్‌తో గుండెకు చేటు!

ఆంధ్రజ్యోతి(23-02-2021)

ఇంటెన్సివ్‌ కేర్‌ దశకు చేరుకుని, కోలుకున్న కొవిడ్‌ బాధితులకు దీర్ఘకాలం పాటు గుండె డ్యామేజీ కొనసాగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌ బారిన పడిన 50 శాతం బాధితుల్లో, భవిష్యత్తులో రాబోయే గుండె సమస్యలకు సంకేతమైన ట్రోపోనిన్‌ పెరుగుతున్నట్టు అధ్యయనకారులు వెల్లడించారు. కొవిడ్‌ బారిన పడి ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్స తీసుకునే స్థితికి చేరుకున్న బాధితుల గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడం కోసం, వారి నమూనాలను కార్డియోవాస్క్యులర్‌ మాగ్నెటిక్‌ రెసొనెన్స్‌ ద్వారా పరీక్షించినప్పుడు, పూర్తి స్థాయిలో పని చేయలేని స్థితికి గుండె ఆరోగ్యం క్షీణించినట్టు తేలింది. అలాగే గుండె వాపు, దీర్ఘకాలపు డ్యామేజీలను కూడా వైద్యులు కనిపెట్టారు. కాబట్టి కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత గుండె ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచి, క్రమంతప్పక గుండె వైద్యులను కలుస్తూ, వారి పర్యవేక్షణలో ఉండడం ఆరోగ్యకరం. 

Advertisement
Advertisement