Advertisement
Advertisement
Abn logo
Advertisement

హృద్రోగులకు మధుమేహ ముప్పు మూడు రెట్లు ఎక్కువ: అధ్యయనం

న్యూఢిల్లీ: మిగతా వారితో పోలిస్తే గుండె జబ్బులతో బాధపడే వారికి మధుమేహ ముప్పు మూడు రెట్లు ఎక్కువని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ఈఎస్‌సీ)కి చెందిన జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం గుండె సంబంధిత వ్యాధులు ఉన్న దాదాపు 30 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు తేలింది. సాధారణ జనాభాలో ఇది 9 శాతంగా ఉంది. అయితే, ప్రాంతాల వారీగా చూసినప్పుడు ఈ గణాంకాల్లో కొంత తేడా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లో 60 శాతం మంది హృద్రోగులు డయాబెటిస్‌తో బాధపడుతుండగా, ఐరోపాలో ఇది 20 శాతంగా ఉంది. 

స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం వంటివి డయాబెటిస్, గుండె జబ్బులకు కామన్ రిస్క్ ఫ్యాక్టర్లని అధ్యయనకారులు పేర్కొన్నారు. పోషణతోపాటు యాక్టివిటీ స్థాయులను ప్రపంచవ్యాప్తంగా తక్షణం పెంచాల్సిన అవసరం ఉందని పారిస్‌లోని  బిచట్-క్లౌడే బెర్నార్డ్ ఆసుపత్రికి చెందిన అధ్యయనకర్త డాక్టర్ ఎమ్మాన్యుయెల్ విడాల్-పెటియట్ తెలిపారు. డయాబెటిస్‌ అత్యంత ఎక్కువగా ఉన్న దేశాలు స్థూలకాయానికి కేంద్ర బిందువుగా మారాయన్నారు. యూరప్, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్యం, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని 45 దేశాల్లో 32,694 దేశాల్లోని రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు డాక్టర్ ఎమ్మాన్యుయెల్ వివరించారు. 


Advertisement
Advertisement