Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సిన్‌తో గుండె ఇన్‌ఫ్లమేషన్‌!

ఆంధ్రజ్యోతి(13-07-2021)

ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రదేశంలో నొప్పి, వాపు, జ్వరం, తలనొప్పి మొదలైన వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు కొందర్లో కనిపించడం సహజం. అయితే కొందరిలో అరుదుగా రక్తం గడ్డ కట్టే సమస్య కూడా తలెత్తుతోంది. దీనితో పాటు ఇంకొందర్లో మయోకార్డైటిస్‌ (గుండె కండరం వాపు), పెరికార్డైటిస్‌ (గుండెను కప్పి ఉంచే పొర ఇన్‌ఫ్లమేషన్‌) సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా మోడర్నా, ఫైజర్‌ వ్యాక్సిన్లతో యువతలో గుండెకు సంబంధించిన రెండు రకాల ఇన్‌ఫ్లమేషన్లు తలెత్తే అవకాశాలు ఉంటున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ చెబుతోంది. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే, ఈ రెండు వ్యాక్సిన్లతోనే గుండెకు సంబంధించిన దుష్ప్రభావాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఈ రకమైన దుష్ప్రభావాలు రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.


అయితే ఇలాంటి సందర్భాలు అత్యంత అరుదనీ, ప్రాణాంతక కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో పోల్చుకుంటే, వ్యాక్సిన్‌ తదనంతర దుష్ప్రభావాలతో జరిగే ఆరోగ్య నష్టం తక్కువే కాబట్టి తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. రెండో డోసు వేయించుకున్న వెంటనే గుండెకు సంబంఽధించిన స్వల్ప అస్వస్థత తలెత్తితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించడం అవసరం.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...