హైదరాబాద్: క్రీడా పాత్రికేయుడు కంచనపల్లి మదనాచారి(39) గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందారు. కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంలో స్పోర్ట్స్ డెస్క్ ఉపసంపాదకుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల డెంగీ జ్వరం సోకి అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ. మదనాచారికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మదనాచారి.. 2013 నుంచి ‘ఆంధ్రజ్యోతి’ స్పోర్ట్స్ డెస్క్‌లో పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రజాశక్తి దినపత్రికలో స్పోర్ట్స్ డెస్క్‌లో విధులు నిర్వర్తించారు. మదనాచారి మృతికి ‘ఆంధ్రజ్యోతి’ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.