Telangana highcourt: చికోటి ప్రవీణ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-08-11T19:36:07+05:30 IST

క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్ పోలీస్ భద్రత కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.

Telangana highcourt: చికోటి ప్రవీణ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: పోలీస్ భద్రత కల్పించాలంటూ క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్ (Chikoti praveen) వేసిన పిటిషన్‌పై హైకోర్టు (High court)లో గురువారం విచారణ జరిగింది. తనకు, తన కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు ఉందని ప్రవీణ్‌ పిటిషన్ వేశారు. ఈడీ (ED) దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ భద్రత కావాలని కోరారు. ఈనెల 4న వినతిపత్రం ఇచ్చినప్పటికీ పోలీసులు సహకరించడం లేదని తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు... చికోటి ప్రవీణ్‌ వినతిని వారంలో పరిశీలించాలని హైదరాబాద్ సీపీ (CP)ని ఆదేశించింది. 

Updated Date - 2022-08-11T19:36:07+05:30 IST