కాన్పూరులో కాల్పుల శబ్దం వినిపించింది...

ABN , First Publish Date - 2020-07-10T16:02:29+05:30 IST

కాన్పూర్ నగర శివార్లలోని సచెండీ ప్రాంతంలో కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ జరిగింది....

కాన్పూరులో కాల్పుల శబ్దం వినిపించింది...

వికాస్‌దూబే ఎన్‌కౌంటర్ పై ప్రత్యక్ష సాక్షుల కథనం

కాన్పూర్ (ఉత్తర్‌ప్రదేశ్) : కాన్పూర్ నగర శివార్లలోని సచెండీ ప్రాంతంలో కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు సచెండీ ప్రాంతంలోని రోడ్డు పక్కన పొలంలో కాల్పుల శబ్దం వినిపించిందని పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కారు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి తాము  కాల్పుల శబ్దం విన్నామని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో రక్తపు మరకలు కనిపించాయి. సంఘటన స్థలంలో వికాస్ దూబే పోలీసు నుంచి లాక్కొన్న పిస్టల్ పడి ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అరెస్టు చేసి పోలీసులు 600 కిలోమీటర్ల దూరం నుంచి కాన్పూరుకు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిన స్థలం వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘటన స్థలాన్ని చూశారు. వికాస్ దూబే ఐదుగురు అనుచరులను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారని, గురువారం అరెస్టు అయిన వికాస్ దూబేను రక్షించాలని కోరుతూ శుక్రవారం సుప్రీంకోర్టులో అతని తరపున పిటిషన్ వేసిన రోజే అతను ఎన్‌కౌంటర్ కావడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-07-10T16:02:29+05:30 IST