Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరోగ్యకరమైన చర్మానికి ఈ ఐదు టిప్సే బెస్ట్‌ అట!

చిన్నవయసులోనే కళ్లకింద మచ్చలు వచ్చేస్తున్నాయ్‌, చర్మం ముడతలు పడిపోతోందని వర్రీ అవుతుంటారు కొందరు. ఈ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నవే. ఎందరో నిపుణులు - ఈ సమస్యలకి ఎన్నో రకాల టిప్స్‌ చెబుతూ ఉంటారు. అయితే దేశాన్ని బట్టీ కాలాన్ని బట్టీ ఆ టిప్స్‌ వేరేవేరేగా ఉండచ్చు. కానీ అందరూ కామన్‌గా చెప్పే, అందరూ అంగీకరించే అయిదు బెస్ట్‌ టిప్స్‌ ఇవేనట!


1. ఎక్కువగా ఎండలో తిరగకపోవడం

2. ఎక్కువ మంచినీళ్లు తాగడం

3. కాయధాన్యాలు, ఆకుకూరలు తినడం

4. ఫాస్ట్‌ ఫుడ్‌ తగ్గించడం

5. సరిగ్గా నిద్రపోవడం


ఈ ఐదు టిప్స్‌ పాటిస్తే కళ్లకింద మచ్చలు రావు. చర్మం తొందరగా ముడతలు పడదు.


ఏం ఉంది? ఇవి తెలిసినవేగా? మామూలుగానే ఉన్నాయిగా? అనుకోవద్దు. ఆరోగ్యకరమైన చర్మం కోసం - ఎవరు ఏ కాలంలో ఎన్ని రకాల టిప్స్‌ చెప్పినా - ఈ ఐదు టిప్సూ మాత్రం తిరుగులేని ఫలితాల్ని ఇచ్చేవి. ఈ విషయమే తాజా పరిశోధనలో తేలింది. తేలింది సరే! పాటించవద్దూ?

Advertisement
Advertisement