అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా?

ABN , First Publish Date - 2022-03-09T18:07:05+05:30 IST

కంటి నిండా కునుకు లేకపోతే ముఖం వాడిపోయినట్లవుతుంది. అర్ధరాత్రి పూట ఆహారం తిని.. తెల్లారుజామున పడుకుని మధ్యాహ్నం నిద్రలేవటం కూడా మంచిది కాదు. అందంగా ఉండాలంటే ముందు లైఫ్‌ స్టయిల్‌ మార్చుకోవాలి. దీంతో పాటు చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవటం వల్ల చర్మం కాంతివంతమవుతుంది.

అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా?

ఆంధ్రజ్యోతి(09-03-2022)

కంటి నిండా కునుకు లేకపోతే ముఖం వాడిపోయినట్లవుతుంది. అర్ధరాత్రి పూట ఆహారం తిని.. తెల్లారుజామున పడుకుని మధ్యాహ్నం నిద్రలేవటం కూడా మంచిది కాదు. అందంగా ఉండాలంటే ముందు లైఫ్‌ స్టయిల్‌ మార్చుకోవాలి. దీంతో పాటు చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవటం వల్ల చర్మం కాంతివంతమవుతుంది. 


ఆహారంలో పీచు పదార్థం, మినరల్స్‌, విటమిన్స్‌ ఉండేట్లు చూసుకోవాలి. చక్కెర, కొవ్వుశాతం ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ఉదయాన్నే నడక లేదా యోగా, జిమ్‌లో వర్కవుట్స్‌ లాంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చెడు కొలెస్ర్టాల్‌ కరిగిపోతాయి. ఎక్కువ శాతం నీళ్లు తాగాలి. కేవలం దప్పిక తీరటమే కాదు.. వొంట్లోని చెడు పదార్థాలను తొలగించే గుణం నీటికి ఉంది. చర్మం మీద ముడతలు పోగొట్టడంతో పాటు చర్మాన్ని మెరుగ్గా చేసే సహజ లక్షణం నీటికే ఉంది. 


ఎక్కువ ఎండలో తిరగకూడదు. చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవటం వల్ల ముఖం కాంతివంతమవుతుంది. 


మంచి నిద్ర వల్ల అందం మరింత మెరుగవుతుంది. ఆరేడు గంటలైతే పర్వాలేదు. తక్కువ నిద్రపోయినా.. మరీ అధికంగా ఎనిమిది గంటలు నిద్రపోయినా చర్మంలో తేడా వస్తుంది. దీంతో పాటు ఒత్తిడిని నియంత్రించుకోగలిగితే చర్మంలో మంచి ఫలితం కనిపిస్తుంది. తాజాదనం ఉంటుంది. 


చేసే పనిని బట్టి ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలి. ఒక సాధారణ వ్యక్తికి రోజుకు రెండు వేల కేలరీలు తీసుకుంటే సరిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. పండ్లలో సహజంగా ఉండే తీపి రుచి ఉంటుంది. దీంతో పాటు పౌష్టిక ఆహారం. తాజా కూరగాయలు, ఆకుకూరల్లో మినరల్స్‌, విటమిన్లు పుష్కలం. ఇవి ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. 


రాగులు, జొన్నలు, కొర్రలు.. లాంటి తృణధాన్యాలతో చేసిన పౌష్టికరమైన ఆహారం తింటే.. శరీరంలోని వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం అందంగా తయారవుతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పు దినుసులు తినాలి. సి-విటమిన్‌ ఉండే ఆహారాన్ని తీసుకోవటం చర్మానికి చాలా మంచిది!

Updated Date - 2022-03-09T18:07:05+05:30 IST