ఇవి తింటున్నారా!
ABN , First Publish Date - 2020-12-26T05:44:27+05:30 IST
చలికాలంలో తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తినాలి. చర్మం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవి ఎంతో తోడ్పడతాయి...
చలికాలంలో తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తినాలి. చర్మం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవి ఎంతో తోడ్పడతాయి.
- చలికాలంలో చర్మ రంధ్రాలు పెద్దవవుతుంటాయి. ఈ కాలంలో దానిమ్మ గింజలు తిన్నా లేదా జ్యూస్ తాగినా చర్మ రంధ్రాలు వెడల్పు కావు. చర్మం బిగుతుగా ఉంటుంది.
- విటమిస్ సి మెండుగా ఉండే కివి పండు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
- చలికాలంలో క్యారట్ తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సూర్యకిరణాలలోని అతినీలలోహిత కిరణాల నుంచి కూడా క్యారట్ చర్మాన్ని కాపాడుతుంది.
- ఖర్జూరాల్లో పీచు, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కంటి చూపు మెరుగవుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
- చిలకడదుంప మాయుశ్చరైజర్‌గా పనిచేసి చర్మానికి మెరుపును ఇస్తుంది.
- పాలకూరలోని పోషకాలు ఒంటిని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- ఈ సీజన్‌లో కాన్‌బెర్రీస్ తింటే శరీరంలోని చెడుకొవ్వు తగ్గుతుంది.
- అరటిపండు చర్మానికి పోషణనిచ్చి, కాంతులీనేలా చేస్తుంది.
- బొప్పాయి కూడా ఈ సీజన్‌లో తినదగ్గ పండు. ఇది మృతకణాలను వదలగొట్టి, చర్మానికి నిగారింపునిస్తుంది.
- ఈ సీజన్‌లో బ్రొకోలి తింటే చర్మం తొందరగా పొడిబారదు. చర్మంపై ఉండే పొరల్లాంటి మచ్చలు తగ్గిపోతాయి.