మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం..!

ABN , First Publish Date - 2022-03-22T19:05:51+05:30 IST

కొన్ని ఆహార పదార్థాల్లో విలువైన పోషకాలుంటాయి. వేర్వేరు జీవక్రియల పనితీరుకు, మెరుగైన

మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం..!

ఆంధ్రజ్యోతి(22-03-2022)

కొన్ని ఆహార పదార్థాల్లో విలువైన పోషకాలుంటాయి. వేర్వేరు జీవక్రియల పనితీరుకు, మెరుగైన ఆరోగ్యానికి తోడ్పడే ఆ పోషకాలను పొందడం కోసం, అవి పుష్కలంగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. 


బాదం పప్పు   

మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

ఎముకలు బలపడతాయి.  

ఆరోగ్యకరమైన కొవ్వులు సమకూరతాయి.  

శక్తి పెరుగుతుంది. 

మెగ్నీషియం, రాగి, విటమిన్‌ ఇ దక్కుతాయి. 

రక్త ప్రసరణ మెరుగవుతుంది.  జీ

ర్ణశక్తి పెరుగుతుంది.


కలబంద రసం  

అధిక బరువు తగ్గుతుంది.  

మధుమేహం అదుపులో ఉంటుంది.  

కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.  

అసిడిటీ లక్షణాలు తగ్గుతాయి.  

వయసు పైబడే లక్షణాలు తగ్గుముఖం పడతాయి.  

అల్సర్లు, ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ అదుపులోకి వస్తాయి. 

మెటబాలిజం పెరుగుతుంది.


పాలకూర 

కళ్లు, ఎముకలు బలపడతాయి.  

వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. అధిక ఆమ్లతత్వం సమమవుతుంది.  

రక్తలేమి తగ్గుతుంది.

మలబద్ధకం తొలుగుతుంది.

పుదీనా  పొట్ట నొప్పి, వాంతులు తగ్గుతాయి.  

తలనొప్పి తగ్గుతుంది.  

దగ్గు, జలుబు తగ్గుముఖం పడతాయి.  

దీన్లోని ఎంజైమ్‌లు కొన్ని కేన్సర్లకు విరుగుడుగా పని చేస్తాయి.  

ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. కాబట్టి నొప్పులు అదుపులోకి వస్తాయి.  

నెలసరి నొప్పులు తగ్గుతాయి.  

ఆస్తమా లక్షణాలు అదుపులోకి వస్తాయి

Updated Date - 2022-03-22T19:05:51+05:30 IST