చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

ABN , First Publish Date - 2022-05-29T06:37:28+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో లోప పోషణ కలిగిన చిన్నా రులను గుర్తించి వారు సంపూర్ణ ఆరో గ్యం పొందేలా పౌష్టికాహారం అందజే యడంతో పాటుగా వైద్య సలహాలు అందించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంక టేశ్వరి అన్నారు.

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
పిల్లల బరువు పరిశీలిస్తున్న పీడీ వెంకటేశ్వరి

పెదపాడు, మే 28 : అంగన్‌వాడీ కేంద్రాల్లో లోప పోషణ కలిగిన చిన్నా రులను గుర్తించి వారు సంపూర్ణ ఆరో గ్యం పొందేలా పౌష్టికాహారం అందజే యడంతో పాటుగా వైద్య సలహాలు అందించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంక టేశ్వరి అన్నారు. పెదపాడు ప్రాజెక్టు పరిధిలోని సౌభాగ్యలక్ష్మినగర్‌ అంగన్‌ వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నా రు. కేంద్రం పరిధిలో బరువు తక్కువ వున్న పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిబ్బందికి సూచించి, పిల్లల ఎత్తు, బరువులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీడీపీవో ఎం.ఎస్‌.రాజశేఖర్‌, వట్లూరు వైద్యాధికారి భారతి, సూపర్‌వైజర్‌ నూర్జాహాన్‌ తదితరులు పాల్గొన్నారు. రుతుక్రమం– పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదపాడు ప్రాజెక్టుపరిధిలోని కిశోర బాలికలకు శానిటరీ ఫ్యాడ్స్‌ పంపిణీ చేశారు.


Updated Date - 2022-05-29T06:37:28+05:30 IST