Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం!

మన పూర్వీకులు ప్రాంతం, కాలానుగుణంగా ఆహార నియమాలు మార్చుకునేవారు. అలాగే కుటుంబాల్లో వంశపారంపర్యంగా ఆహార నియమాలు సంక్రమిస్తూ ఉంటాయి. అనుకూలమైన ఆహారం తీసుకోవడం వల్ల జన్యుపరంగా మన శరీర తత్వానికి అనుగుణంగా ఉంటుంది. ఇలాంటి ఆహారంతో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయి. పోషక లోపాలు తలెత్తకుండా ఉండాలన్నా, రోగనిరోధకశక్తి చెక్కు చెదరకుండా ఉండాలన్నా జన్యుపరంగా అనుకూలమైన ఆహారం తీసుకోవాలి.


మనకు మునుపు అలవాటు లేని, సరిపడని ఆహారం తీసుకోవలసివస్తే, కాలేయం మీద అదనపు భారం పడుతుంది. ఆహారంలో విషపదార్థాలు (టాక్సిన్లు) ఉంటే, వాటిని కూడా కాలేయం వడగడుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు సరిపడని ఆహారం తీసుకుంటే కాలేయం పనితీరు దెబ్బతిని, జీవక్రియలు కుంటుపడి రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. 


ఏ ఆహారంతో ఊబకాయం సంక్రమిస్తుందో, ఏ ఆహారంతో శరీర బరువు తగ్గుతుందో ఆయుర్వేదంలో చెప్పలేదు. శరీరం పని చేయడానికి సహకరిస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు, లేదంటే అనారోగ్యంతో ఉన్నట్టు గ్రహించాలి. లావుగానో, సన్నగానో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు భావించడం సరి కాదు. 


ప్రస్తుతం సంప్రదాయ ఆహారాన్ని పిల్లలు ఇష్టపడకపోవడానికి కారణాలు ఉన్నాయి. జంక్‌ ఫుడ్‌లో రుచిని పెంచే టేస్టింగ్‌ సాల్ట్‌ వంటివి వాడడం వల్ల పిల్లలు వాటిని తింటూ ఉంటారు. కాబట్టి హానికారకమైన జంక్‌ ఫుడ్‌ను మాన్పించి, పిల్లల చేత ఇంటి ఆహారం తినిపించేలా చేయడం తల్లితండ్రుల బాధ్యత. పిల్లలను సంప్రదాయ ఆహారం తినమని ఒత్తిడి చేయకుండా, ఈ ఆహారంలోని పోషక విలువలు, వాటితో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి, ఆహారం మీద మక్కువ పెంచాలి. 

- జి. శశిధర్‌,అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement