యెగాతో ఆరోగ్యవంతమైన సమాజం

ABN , First Publish Date - 2021-06-22T06:52:38+05:30 IST

యోగాతో ఆరోగ్యవంత సమాజం రూపుదిద్దుకుంటుందని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

యెగాతో ఆరోగ్యవంతమైన సమాజం
యోగా చేస్తున్న యువతులు

- అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జూన్‌ 21: యోగాతో ఆరోగ్యవంత సమాజం  రూపుదిద్దుకుంటుందని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. సోమవారం పతంజలి యోగా సమితి, భారతస్వామిభిమాన్‌, యువభారత్‌ ఆధ్వర్యంలో  వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ యోగాను దినచర్యలో భాగం చేసుకున్నట్లయితే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యంతో మనిషి ఆనందంగా జీవించవచ్చన్నారు. కార్యక్రమంలో పతంజలి యోగా సమితి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ముత్యాల రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు బి లక్ష్మినారాయణ, యువభారత్‌ జిల్లా అధ్యక్షుడు కొండా లక్ష్మణ్‌బాబు, భారత్‌స్వాభిమాన్‌ ఉపాధ్యక్షుడు దారం వినోద్‌, మహిళా పతంజలి యోగా సమితి కో-ఆర్డినేటర్‌ గందె కల్పన, కిసాన్‌ పంచాయతీ అధ్యక్షుడు కడార్ల రవీందర్‌, యోగాచార్యులు సుమలత, మర్రి రాజేందర్‌, శ్రీనివాస్‌, మనోజ్‌ ముందాడా, జైపాల్‌రెడ్డి, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T06:52:38+05:30 IST