Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌!

ఆంధ్రజ్యోతి(17-03-2021)

ఫిట్‌నెస్‌ లక్ష్యంతో ఉన్నవారికి ప్రొటీన్లు ఎక్కువగా, చక్కెరలు తక్కువగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ కావాలి. అంతేకాదు ఆ బ్రేకఫాస్ట్‌లో జీవక్రియలను వేగవంతం చేసి, శక్తిని ఇవ్వడంతో పాటు మెదడును చురుకుగా ఉంచేందుకు అధికమొత్తంలో ఫ్యాట్స్‌ ఉండాలి. అదేసమయంలో త్వరగా పూర్తవ్వాలి. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లే అవకాడో బేక్‌డ్‌ ఎగ్‌, ఓవర్‌నైట్‌ ఓట్స్‌... 


అవకాడో బేక్‌డ్‌ ఎగ్‌

కావాల్సినవి: ఒక అవకాడోను రెండుగా కోసి, గింజను తొలగించాలి. అవకాడో పై తోలును అలాగే ఉంచాలి. రెండు గుడ్లు, తాజా హెర్బ్స్‌, తరగిన జున్ను, కార్న్‌ఫ్లేక్స్‌, కొత్తిమీర (రుచి, అలంకరణ కోసం). 


తయారీ విధానం: ఓవెన్‌ను ముందుగానే 140 డిగ్రీలకు వేడిచేయాలి. రెండుగా కోసిన అవకాడోను అల్యూమినియం ఫాయిల్‌ బేకింగ్‌ షీట్‌లో ఉంచాలి. ఇప్పుడు గుడ్లను పగలగొట్టి అవకాడో మధ్యలో పోయాలి. జున్ను, కార్న్‌ఫ్లేక్స్‌, కొత్తిమీర... ఇలా మీకు నచ్చిన వాటితో గార్నిష్‌ చేయాలి. ఓవెన్‌లో అవకాడోను 8-10 నిమిషాలు ఉడికించాలి. లేదంటే గుడ్డు పచ్చసొన ఉడికేంత వరకు ఓవెన్‌లో ఉంచాలి. అంతే బ్రేక్‌ఫాస్ట్‌గా అవకాడో బేక్‌డ్‌ ఎగ్‌ రెడీ.

ఓవర్‌నైట్‌ ఓట్స్‌

గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఓట్స్‌, ప్రొటీన్‌, సహజ తీపిదనంతో కూడిన ఈ స్మూతీని వర్కవుట్‌కు ముందు తింటే కావాల్సినంత శక్తి వస్తుంది. 


కావాల్సినవి: కప్పు చొప్పున రోల్‌డ్‌ ఓట్స్‌, బాదం లేదా పాలు. సగం కప్పు గ్రీక్‌ యోగర్ట్‌, టేబుల్‌ స్పూన్‌ మ్యాపిల్‌ సిరప్‌, ఒక స్కూప్‌ ప్రొటీన్‌ పౌడర్‌ (వెనీలా లేదా చాక్లెట్‌), టేబుల్‌ స్పూన్‌ చియా సీడ్స్‌, ముక్కలుగా కోసిన నట్స్‌ ఏవైనా రెండు టేబుల్‌స్పూన్లు, తాజా అరటి పండు (లేదా మీకు నచ్చినది). 


తయారీ విధానం: తాజా పండు తప్ప అన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ గిన్నెపై మూత పెట్టి, రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఓవర్‌నైట్‌ ఓట్స్‌ను మీకు నచ్చిన పండ్ల ముక్కలను జోడించి తినాలి.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...