నిలుచున్న చోటే వ్యాయామం

ABN , First Publish Date - 2020-04-13T05:00:27+05:30 IST

కిక్‌ ఇచ్చినట్టు..: నిటారుగా నిలబడి, చేతులను ఛాతీ ఎత్తులో చాచండి. కుడి కాలును కిక్‌ ఇచ్చినట్టు పైకి లేపి, చేతులను తాకించేందుకు ప్రయత్నించండి. కానీ మోకాలు వంగకూడదు. అలా 30 సెకన్లపాటు చేసి, ..

నిలుచున్న చోటే వ్యాయామం

  • వర్కవుట్‌ ఫ్రమ్‌ హోమ్‌ 


ఇప్పుడంతా ఇంట్లోనే కాలక్షేపం. మనసు పుట్టి వ్యాయామం చేద్దామన్నా సరిపడా ఖాళీ దొరకదు. అందుకే ఎక్కడికీ కదలకుండా... ఇంకా చెప్పాలంటే నిలుచున్న చోటే చేయగల మంచి ఎక్స్‌ర్‌సైజ్‌లు ఇవి. మీరూ ఓసారి ట్రై చేయండి. 


కిక్‌ ఇచ్చినట్టు..: నిటారుగా నిలబడి, చేతులను ఛాతీ ఎత్తులో చాచండి. కుడి కాలును కిక్‌ ఇచ్చినట్టు పైకి లేపి, చేతులను తాకించేందుకు ప్రయత్నించండి. కానీ మోకాలు వంగకూడదు. అలా 30 సెకన్లపాటు చేసి, 30 సెకన్లు విశ్రాంతి ఇవ్వండి. ఇదే తరహాలో నాలుగు సెట్లు చేయండి. 


మోకాళ్లు వంచి..: కాళ్లు కాస్త దూరంగా జరిపి నిల్చోండి. చేతులను తల వెనుక పెట్టుకోండి. ఇప్పుడు పొట్ట కండరాలను బిగించి, ఎడమ కాలును ఒక అడుగు ముందుకు వేసి, మోకాళ్లు కొద్దిగా బెండ్‌ చేయండి. ఇప్పుడు వెన్నెముక తిన్నగా పెట్టి, మీ ఛాతీ నేలకు సమాంతరంగా వచ్చేవరకు ముందుకు వంగండి. నిదానంగా నడుము పైభాగాన్ని ఎడమ వైపునకు తిప్పుతూ పైకి లేచి, మీ భుజాలను చూడండి. ఇలా 15 సార్లు చేయాలి. 


జాయ్‌ ఆఫ్‌ జంపింగ్‌..: కాళ్లను కాస్త ఎడంగా పెట్టి నిల్చొని, చేతులు ముందుకు చాచండి. ఇప్పుడు జంప్‌ చేస్తూ, మోకాళ్లను సాధ్యమైనంత వరకు మీ ఛాతీకి దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయండి. మొదటి పొజిషన్‌కు వచ్చి, మళ్లీ పైన చెప్పినట్టు చేయండి. ఇలా 30 సెకన్లు వ్యాయామం, అంతే సమయం విశ్రాంతి ఇస్తూ నాలుగు సెట్లు చేయాలి. 

Updated Date - 2020-04-13T05:00:27+05:30 IST