Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీడ్స్‌తో ఆరోగ్యం!

ఆంధ్రజ్యోతి(17-05-2021)

చియా సీడ్స్‌లో ఒమెగా 3, ఫైబర్‌, ప్రొటీన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌, పొటాషియం, విటమిన్‌ బి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. మెదడు చురుకుగా మారుతుంది. ఎముకలు బలపడతాయి. కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయి. డయాబెటిస్‌, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. 

అవిసెలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. బ్లడ్‌షుగర్‌ నియంత్రణలో ఉంటుంది. కేన్సర్‌ను నిరోధించే గుణం వీటిలో ఉంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. డయాబెటిస్‌, గుండె జబ్బులు, స్ట్రోక్‌ వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

నువ్వులలో విటమిన్లు, మినరల్స్‌, ఫైటోన్యూట్రియెంట్స్‌ ఉంటాయి. కాపర్‌, మెగ్నీషియం అత్యధికంగా లభిస్తుంది. ఐరన్‌, పాస్ఫరస్‌, జింక్‌, ఫైబర్‌ కూడా లభిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా కేన్సర్‌ ప్రివెన్షన్‌గా పనిచేస్తాయి.

గుమ్మడి విత్తనాలలో ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం అత్యధికంగా లభిస్తాయి. ఇందులో ఉండే ఎల్‌-ట్రిప్టోపన్‌ అనే అమైనోయాసిడ్‌ డిప్రెషన్‌, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. ప్రొస్టేట్‌, హార్ట్‌ హెల్త్‌కు గుమ్మడి విత్తనాలు బాగా పనిచేస్తాయి. విటమిన్‌ బి లోపంతో బాధపడే వారు ఈ విత్తనాలు తీసుకుంటే ఆ సమస్య దూరమవుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసే గుణం కూడా ఈ విత్తనాలకు ఉందని పరిశోధనల్లో తేలింది. వీటిలో ఉండే ఫ్యాటీయాసిడ్స్‌ రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. 

పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటే విటమిన్‌ ఇ ఎక్కువగా లభిస్తుంది. ఇమ్యూనిటీని పెరుగుతుంది. ఈ విత్తనాలు యాంటీఏజింగ్‌గా పనిచేస్తాయి.. చర్మాన్ని, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో ఈ విత్తనాలు ఉపకరిస్తాయి. వీటిలో ఫోలేట్‌ లభిస్తుంది కాబట్టి గర్భిణిలకు ఇది మంచి ఆహారం. ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఆస్తమా తీవ్రతను తగ్గిస్తుంది.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...