స్వచ్ఛ సంకల్పం’తో ఆరోగ్యకర వాతావరణం

ABN , First Publish Date - 2021-10-21T06:17:10+05:30 IST

గిరిజనులు స్వచ్ఛమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించేలా ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ అన్నారు.

స్వచ్ఛ సంకల్పం’తో ఆరోగ్యకర వాతావరణం
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ 


జి.మాడుగుల, అక్టోబరు 20: గిరిజనులు స్వచ్ఛమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించేలా ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీధులు, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని పిలుపునిచ్చారు. కాగా జి.మాడుగుల-2 సచివాలయం వీఆర్‌వో టి.వెంకటేశ్వర్‌ బుధవారం విధులు హాజరు కాకపోవడంతో అతనికి ఒక రోజు జీతం కట్‌ చేయాలని తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌ను ఆయన ఆదేశించారు. అనంతరం పాలమామిడి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.వెంకన్నబాబు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:17:10+05:30 IST