హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-26T07:09:36+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ ఆధ్వర్యంలో జగన్నాథపురంలో ఆందోళన నిర్వహించి ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 25 : హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ  అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ ఆధ్వర్యంలో జగన్నాథపురంలో ఆందోళన నిర్వహించి ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలుగు మహిళలు పాలపర్తి పద్మజ, మద్దాల లక్ష్మీనాంచారమ్మ, ఎన్‌. వసంతకుమారి, లతీపున్నీసా, బడుగు ఉమాదేవి, పాలమాని రాధా, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ప్రచార కార్యదర్శి పి.వి. ఫణికుమార్‌  పాల్గొన్నారు. పెడన : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని ఖండిస్తూ 14వ వార్డులో  ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బొడ్డు వేణుగోపాలరావు, యక్కల శ్యామలయ్య, అనుముల పూర్ణ, పడవల పైడేశ్వరరావు, వాసా సాంబశివరావు, త మ్మా బీమయ్య, పరసా జితేంద్ర, ఎలిగట్ల ప్రసాద్‌, చిలకల శ్రీనివాస గుప్తా తదితరులు పాల్గొన్నారు. తోట్లవల్లూరు  :  డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు జీవోని ఉపసంహరించుకోవాలని  మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరామ్‌ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. హెల్త్‌ యూనివర్సిటీ పేరుని వైఎ్‌సఆర్‌ యూనివర్సిటీగా మార్చటాన్ని నిరసిస్తూ ఆదివారం శివరామ్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు చాగంటిపాడు, పెనమకూరు, కనకవల్లి, గరికపర్రు గ్రామాల్లో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు.  మూడు గ్రామాల్లోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.    వంశీకృష్ణారెడ్డి,  శివశంకరరెడ్డి, మధుసూదనరెడ్డి, మర్రెడ్డి బసివిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నర్రా వెంకట అప్పారావు,  వీరంకి పరశురామ్‌, గూడపాటి గిరిబాబు, వీరంకి వరహాలరావు, సూరపనేని హనుమంతరావు, కొల్లి శ్రీనివాసరెడ్డి, తలశిల శ్రీనివాసప్రసాద్‌,  అమృతబాబు, ఈడే వాసు, ఇంటూరి రాము, సూరపనేని లక్ష్మణరావు  పాల్గొన్నారు.

ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు

  ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్చకుండా చేయి తండ్రి అంటూ  కరగ్రహారంలోని ఫరీద్‌బాబా దర్గా వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.   రూరల్‌  పార్టీ అధ్యక్షుడు కుంచే నాని ఆధ్వర్యంలో జరిపిన ప్రార్థనల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్‌, టీడీపీ నాయకులు బత్తిన నాగరాజు  పాల్గొన్నారు. కోడూరు  : హెల్త్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ ఎన్టీఆర్‌ కొనసాగించాలని కోరుతూ  మండల టీడీపీ నేతలు ఆదివారం ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కోడూరు  సాయిబాబా ఆలయం వద్ద, పెదగుడుమోటు సీబీ ఎన్‌ చర్చి, బాబావలి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.     మండల టీడీపీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, మాజీ డీసీ ఛైర్మన్‌ గుడిసేవ సూర్యనారాయణ,  డీసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కాగిత రామారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు బడే వీరబాబు, బెల్లంకొండ కోటేశ్వరరావు, ఉప్పాల పోతురాజు, వేములపల్లి శ్రీకృష్ణ, బొలిశెట్టి విఠల్‌ రావు, మల్లాది ప్రసాద్‌, చింతల రమేష్‌, ఎండి.ఇమ్రాన్‌, అబ్దుల్లా వాహేబ్‌, డి.నాగమల్లేశ్వరరావు, జి.ఈశ్వరరావు పాల్గొన్నారు. మోపిదేవి  : హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించేలా చూడాలంటూ టీడీపీ శ్రేణులు ఆదివారం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉత్తరచిరువోలులంకలో చిరువోలులంక చర్చిలో మండల టీడీపీ అధ్యక్షుడే నడకుదుటి జనార్దనరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించేలా సీఎం జగన్మోహన్‌రెడ్డి మనస్సు మార్చాలని ప్రార్థనలు చేశారు.  నడకుదుటి వెంకటేశ్వరరావు, విశ్వనాధపల్లి వేణు  పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-26T07:09:36+05:30 IST