బైక్‌పై వెళుతున్నారా!

ABN , First Publish Date - 2020-02-16T06:40:03+05:30 IST

రయ్‌మంటూ బైక్‌ మీద రోడ్డు ట్రిప్‌ వెళ్లడం, ఎక్కువ దూరం ప్రయాణంచడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే వాతావరణం ఉండదు. ఎక్కువ సమయం తడి, పొడి గాలులు, ఎండకు ఎక్స్‌పోజ్‌ అవడం వల్ల చర్మం, కేశాలు దెబ్బతినే

బైక్‌పై వెళుతున్నారా!

రయ్‌మంటూ బైక్‌ మీద రోడ్డు ట్రిప్‌ వెళ్లడం, ఎక్కువ దూరం ప్రయాణంచడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే వాతావరణం ఉండదు. ఎక్కువ సమయం తడి, పొడి గాలులు, ఎండకు ఎక్స్‌పోజ్‌ అవడం వల్ల చర్మం, కేశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి బైక్‌పై లాంగ్‌ జర్నీకి వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే...


చర్మం రక్షణ

  • చలి తగ్గి ఎండలు పెరుగుతున్న సమయం ఇది. ఎక్కువ సమయం ఎండలో ప్రయాణించడం వల్ల చర్మం మీద దద్దుర్లు ఏర్పడడం, చర్మ కణజాలం దెబ్బతినడం, చర్మం రంగు మారడం వంటివి సాధారణం. అలాంటప్పుడు బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవడం వల్ల ఎండ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. 
  • ప్రయాణ దూరం ఎక్కవ ఉన్నప్పుడు చర్మం నీటిని కోల్పోతుంది. అలా జరగకుండా క్లీన్సర్‌ వాడాలి. తరువాత హైడ్రేటింగ్‌ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. దాంతో చర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది. 
  • రోడ్డు మీది దుమ్ము చర్మ రంధ్రాల్లో చేరడం వల్ల అవి మూసుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. అప్పుడు వెట్‌ వైపర్స్‌ వెంట ఉంటే ఏ ఇబ్బంది లేకుండా సాగిపోవచ్చు. వీటితో తుడుచుకుంటే చర్మం పొడిగా, గరుకుగా మారదు.
  • ప్రయాణ సమయంలో చర్మానికి గాలి తగిలేలా ఉండే దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. హెవీ మేకప్‌ మానుకోవాలి. దాంతో చర్మం తొందరగా అలసిపోయినట్టు కనిపించదు. అలానే మేకప్‌ కిట్‌లో లిప్‌బామ్‌ ఉండేలా చూసుకోవాలి. 

కేశ సంరక్షణ

  • బైక్‌ మీద ప్రయాణించే సమయంలో జుట్టును లూజుగా వదిలేయడం అంత మంచిది కాదు. తడి, పొడి గాలుల వల్ల కురులు చిక్కుపడి దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వెంట్రుకలను చక్కగా జడ లేదా కొప్పు వేసుకోవాలి.
  • సూర్యరశ్మి కారణంగా వెంట్రుకలు దెబ్బతినకుండా హైడ్రేటింగ్‌ సీరమ్‌ రాసుకోవాలి. ఇది కేశాలకు వేడి తగలనీయదు. కురులను బలంగా మారుస్తుంది. గమ్యం చేరిన తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. కండీషనర్‌ అప్లై చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ గమ్యం చేరుకోవచ్చు.

Updated Date - 2020-02-16T06:40:03+05:30 IST