వారం రోజులు బంకర్లోనే..

ABN , First Publish Date - 2022-03-06T17:41:34+05:30 IST

వారం రోజులపాటు బంకర్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపామని ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థిని ఐవన్‌ బుశ్ర తెలిపారు. చిక్కబళ్లాపుర జిల్లా చేళూరు తాలూకాకు చెందిన నూర్‌ అహ్మద్‌ కుమార్తె ఐవ

వారం రోజులు బంకర్లోనే..

                        - ఉక్రెయిన్‌ నుంచి చేలూరు చేరిన వైద్య విద్యార్థిని ఐవన్‌ బుశ్ర


చేళూరు(కర్ణాటక): వారం రోజులపాటు బంకర్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపామని ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థిని ఐవన్‌ బుశ్ర తెలిపారు. చిక్కబళ్లాపుర జిల్లా చేళూరు తాలూకాకు చెందిన నూర్‌ అహ్మద్‌ కుమార్తె ఐవన్‌ బుశ్ర శుక్రవారం క్షేమంగా చేరుకోవడంపై తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. కీవ్‌ నుంచి బస్సు మార్గంలోనూ, ఆపై విమానంలో ఢిల్లీకి చేరుకున్నామని ఆమె పేర్కొన్నారు. అక్కడి నుంచి బెంగళూరుకు, తర్వాత స్వగ్రామానికి చేరుకున్నట్టు తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బంకరులో దాదాపు వారం రోజులు ఉన్నామని, ఉన్న ఆహారాన్ని అందరూ సర్దుబాటు చేసుకున్నామన్నారు. హాస్టల్‌లో ఉన్న తాము సరిహద్దుకు వచ్చేందుకు ఎంతో శ్రమపడాల్సి వచ్చిందన్నారు. 

Updated Date - 2022-03-06T17:41:34+05:30 IST