దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 80,472 కరోనా కేసులు నమోదు!

ABN , First Publish Date - 2020-09-30T15:45:12+05:30 IST

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 52,25,764కు చేరింది. గడచిన 24 గంటల్లో 80,472 మందికి కరోనా సోకగా, ఇదే సమయంలో మొత్తం 1,179 మంది మృతి చెందారు.

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 80,472 కరోనా కేసులు నమోదు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య 62,25,764కు చేరింది. గడచిన 24 గంటల్లో 80,472 మందికి కరోనా సోకగా, ఇదే సమయంలో మొత్తం 1,179 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 97,497కు చేరింది. గడచిన 24 గంటల్లో మొత్తం 86,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ సందర్బంగా కేంధ్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఐసీఎంఆర్ నిర్వహించిన రెండవదశ సీరో సర్వే రిపోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే దేశంలోని సగం జనాభా కరోనా బారినపడ్డారు.



ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 22 వరకూ 29,082 మందిని పరిగణలోకి తీసుకుని సర్వే చేయగా, వారిలో 6.6 శాతం మందికి కరోనా సోకినట్లు తేలిందన్నారు. కాగా మహారాష్ట్రలో కరోనా బారిన పడినవారి సంఖ్య కన్నా, వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 14,976 కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 19,212 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 

Updated Date - 2020-09-30T15:45:12+05:30 IST