కరోనా వదల్లేదు.?

ABN , First Publish Date - 2022-04-07T13:12:30+05:30 IST

కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, కరోనా నిబంధనలను గాలికొదిలేయవద్దని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన

కరోనా వదల్లేదు.?

- కొత్త వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి

- మాస్కు తప్పనిసరి

- ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌


పెరంబూర్‌(చెన్నై): కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, కరోనా నిబంధనలను గాలికొదిలేయవద్దని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన పంపిన ఉత్తర్వుల్లోని వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 20లోపే ఉండగా, కొన్ని జిల్లాలో స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, సేలం, తిరుప్పూర్‌ జిల్లాల్లో కొత్త వైరస్‌ లక్షణాలు గుర్తించామన్నారు. బహిరంగ ప్రాంతాల్లోకి వచ్చేందుకు వ్యాక్సిన్‌ తప్పనిసరి కాదని ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రకటించిందని, అదే సమయంలో మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలు ఉపసంహరించుకోలేదని తెలిపారు. ప్రపంచంలో ప్రస్తుతం 7నుంచి 10 లక్షల మందికి కొత్త రకం వైరస్‌ లక్షణాలు నిర్ధారణ అయ్యాయని తెలిపారు. కరోనాను జయించామని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిచడంతో పాటు అనుమానం ఉన్న వారి రక్తనమూనాలను పరిశోధనలకు పంపాలని కోరారు. గతంలో తీసుకున్న చర్యలతో అందిన ఫలితాన్ని భవిష్యత్తులోనూ అనుభవించేలా ప్రజలు సహకరించడం రాబోయే రోజుల్లో అత్యంత అవసరమని రాధాకృష్ణన్‌ తెలిపారు.

Updated Date - 2022-04-07T13:12:30+05:30 IST