పునరావాస కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-07T11:19:19+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్థానిక ఎస్టీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న యాచకులు, వలస కూలీలకు పీహెచ్‌సీ

పునరావాస కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు

పలాస, ఏప్రిల్‌ 6: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్థానిక ఎస్టీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న యాచకులు, వలస కూలీలకు పీహెచ్‌సీ వైద్యాధికారి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరికి దగ్గు, ఆయాసం ఉన్నట్టు గుర్తించారు.  ఆయనకు రక్తపరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.


స్థానిక సీహెచ్‌సీ పరిధిలో సోమవారం సర్వేలెన్స్‌ బృందం ఆధ్వర్యంలో 15మందికి రక్తపరీక్షలు చేశారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న 8మందిని గుర్తించి సీహెచ్‌సీకి తరలించారు. వీరి నుంచి కరోనా పరీక్షకు అవసరమైన నమూనాలను సేకరించారు. వీటిని రిమ్స్‌కు పంపించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సీతారామరాజు, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ దామోదర ప్రధాన్‌, తహసీల్దార్‌ పి. అమల పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-07T11:19:19+05:30 IST