హెల్త్‌ ప్రొఫైల్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-28T06:11:24+05:30 IST

ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్‌ ప్రొఫైల్‌పై వైద్య సిబ్బంది అవగాహన పెంచుకుని పకడ్భందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

హెల్త్‌ ప్రొఫైల్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఎల్లారెడ్డిపేట/వేములవాడ టౌన్‌, జనవరి 27: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్‌ ప్రొఫైల్‌పై వైద్య సిబ్బంది అవగాహన పెంచుకుని పకడ్భందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న హెల్త్‌ ఫ్రొఫైల్‌ డిజిటల్‌ శిక్షణ తరగతులను గురువారం  పరిశీలించారు. ప్రతీ టీమ్‌ ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించాలని సిబ్బందికి సూచిం చారు. డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు, ఆస్పత్రి సూప రింటెండెంట్‌ మహేష్‌రావు, తదితరులు ఉన్నారు.  

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో హెల్త్‌ ప్రొఫైల్‌పై వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో హరిదాస్‌నగర్‌ గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి సర్వే చేపట్టిందన్నారు. వైద్య సిబ్బంది ప్రతీ అంశంపై అవగాహన కల్పించుకోవాలని, ఇంటింటా ప్రజల ఆరోగ్య పరిస్థితులను సేకరించి నమోదు చేయాలని అన్నా రు. 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరి ఆరోగ్య వివరాలను పొందు పర్చాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందస్తుగా గుర్తించనున్నట్లు, నివారణ  చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.  జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, ఎంసీహెచ్‌ ప్రోగ్రాం అధికారి కపిలసాయి, మండల వైద్యాధికారి ధర్మానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T06:11:24+05:30 IST