రాష్ట్రంలో అరకోటి మంది Covid టీకాలకు దూరం

ABN , First Publish Date - 2022-03-23T18:20:13+05:30 IST

రాష్ట్రంలో మొదటి విడత వ్యాక్సిన్‌ కూడా వేసుకోనివారు సుమారు 51 లక్షల మంది వరకు ఉన్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. వీరంతా సకాలంలో మొదటి విడత

రాష్ట్రంలో అరకోటి మంది Covid టీకాలకు దూరం

- బతిమలాడినా రాకుంటే ఎలా?

- మంత్రి సుబ్రమణ్యం  


చెన్నై: రాష్ట్రంలో మొదటి విడత వ్యాక్సిన్‌ కూడా వేసుకోనివారు సుమారు 51 లక్షల మంది వరకు ఉన్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. వీరంతా సకాలంలో మొదటి విడత వ్యాక్సిన్‌ వేసుకుని వుంటే కరోనా బాధితుల సంఖ్య ఇంకా తగ్గిఉండేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని రకాలుగా అవగాహనా కల్పిస్తున్నా, ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది బతిమలాడుతున్నా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు కొంతమంది ముందుకు రావడం లేదని మంత్రి వాపోయారు. స్థానిక జాఫర్‌ఖాన్‌పేటలో కొత్తగా నిర్మించిన కార్పొరేషన్‌ పాఠశాల భవనాన్ని మంత్రి మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ఎం.ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 12 నుంచి 14 యేళ్లలోపువారు 21.21 లక్షల మంది ఉన్నారని గత వారం రోజులుగా వీరికోసం నిర్వహించిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 6.29లక్షల మంది టీకాలు వేసుకున్నారని చెప్పారు. అదే విధంగా 15 నుండి 18 యేళ్లలోపువారు 28.37లక్షల మంది ఉన్నారని, వీరిలో 84 శాతం మందికి టీకాలు వేశామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నాలుగో విడత వ్యాప్తి వస్తుందో రాదో ఖచ్చితంగా తెలియడం లేదని, అయినా రాష్ట్ర ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనల్ని తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.. రాష్ట్రంలో 51 లక్షల మంది మొదటి విడత వ్యాక్సిన్‌ వేసుకోకపోవడంతో తమకెంతో ఆందోళన కలిగిస్తోందని  వీరందరూ ఇకనైనా ప్రభుత్వం ప్రతి శనివారం ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు వెళ్ళి టీకాలు వేసుకోవాలని మంత్రి మరీ మరీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-03-23T18:20:13+05:30 IST