ప్రమాదం జరిగిన కోవిడ్ సెంటర్‌ గురించి ఆళ్ల నాని చెప్పిన విషయాలివీ..

ABN , First Publish Date - 2020-08-09T20:42:10+05:30 IST

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై మంత్రులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ప్రమాదం జరిగిన కోవిడ్ సెంటర్‌ గురించి ఆళ్ల నాని చెప్పిన విషయాలివీ..

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై మంత్రులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు, పేర్ని నానితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రి వారు హోటల్‌లో కోవిడ్ సెంటర్‌ను నడుపుతున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన కోవిడ్ సెంటర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్ కాదని ఆళ్ల నాని స్పష్టం చేశారు. హోటల్‌లో ఉన్న కోవిడ్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండవన్నారు. కేవలం తక్కువ స్థాయి వైరస్ లక్షణాలు ఉన్న వారి కోసమే హోటల్ సెంటర్‌లు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. 



కేసు నమోదు.. విచారణ

రమేష్ హాస్పిటల్ వారు మే నెలలో స్వర్ణ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా పర్మిషన్ కావాలని అడిగారు. జులై నుంచి స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ సెంటర్‌ను నడిపిస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నాం. మానవ తప్పిదం వలన ప్రమాదం జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రమేష్ హాస్పిటల్‌పై కేస్ నమోదు చేశాం.. విచారణ కూడా జరుగుతోంది. మొదటగా 84 ప్రైవేట్ హాస్పిటల్‌లను కోవిడ్ సెంటర్ లుగా అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత పేషెంట్స్ సంఖ్య పెరగడంతో 134 వరకు కోవిడ్ సెంటర్‌లను పెంచడం జరిగింది. ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ఎక్కువ ఫీజ్ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ గా నడుస్తున్నవి విజయవాడలో 15 ఉన్నాయిఅని నాని మీడియాకు తెలిపారు.

Updated Date - 2020-08-09T20:42:10+05:30 IST