రుచిగా ఉందని రోజూ బిర్యానీలు లాగించేస్తున్నారా? అయితే వెంటనే ఇది తెలుసుకోండి!

ABN , First Publish Date - 2022-02-04T18:12:58+05:30 IST

ప్రస్తుతం పిల్లల నుంచి వృద్ధుల వరకు రకరకాల బిర్యానీలకి అలవాటు పడ్డారు. ఏ వయసు వారు ఎంత మోతాదులో బిర్యానీ తినవచ్చు. దీని వల్ల అనర్థాలు ఏమైనా ఉన్నాయా?

రుచిగా ఉందని రోజూ బిర్యానీలు లాగించేస్తున్నారా? అయితే వెంటనే ఇది తెలుసుకోండి!

ఆంధ్రజ్యోతి(04-02-2022)

ప్రశ్న: ప్రస్తుతం పిల్లల నుంచి వృద్ధుల వరకు రకరకాల బిర్యానీలకి అలవాటు పడ్డారు. ఏ వయసు వారు ఎంత మోతాదులో బిర్యానీ తినవచ్చు. దీని వల్ల అనర్థాలు ఏమైనా ఉన్నాయా?


- జనార్దన్‌, అనంతపురం


డాక్టర్ సమాధానం: సుగంధ ద్రవ్యాల వల్ల వచ్చే కమ్మని వాసన, రుచితో అన్ని వయసుల వారికీ బిర్యానీ ఇష్టంగా ఉంటుంది. ఇది బియ్యంతో చేసే పదార్థం కాబట్టి అధికమొత్తంలో తీసుకొంటే శరీరానికి అవసరమైన దాని కన్నా ఎక్కువ పిండి పదార్థాలు లభిస్తాయి. బయట కొన్న బిర్యానీలో లేదా ఇంట్లో ఎక్కువ నూనె లేదా నెయ్యో వేసి చేసే బిర్యానీలో కెలోరీలు కూడా ఎక్కువే. సాధారణంగా ఇందులో వేసే కూరగాయల పరిమాణం  తక్కువ. కాబట్టి విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం లాంటి ఆవశ్యక పోషకాలు చాలా తక్కువ లభిస్తాయి. మాంసాహారంతో కూడిన ఎగ్‌, చికెన్‌, మటన్‌ మొదలైన బిర్యానీల్లో కొంత వరకు ప్రొటీన్లు  ఉన్నప్పటికీ ఎక్కువ శాతం అన్నం, అధికంగా కొవ్వులు ఉండడం వల్ల వీటిల్లోనూ కెలోరీలు ఎక్కువే. రెండు రోజులకొకసారో, వారానికోసారో బిర్యానీల్లాంటివి తీసుకొంటే క్రమంగా అధిక బరువు, ఊబకాయంతో పాటు అధికరక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో పరిమిత మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం పాడవకుండా రుచిని ఆస్వాదించేందుకు వీలుంటుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-04T18:12:58+05:30 IST