ఇంట్లో చికిత్సకూ ఆరోగ్య బీమా

ABN , First Publish Date - 2021-06-23T09:19:03+05:30 IST

ఇంటి వద్ద తీసుకునే వైద్య సేవలకూ ఇక ఆరోగ్య బీమా కవరేజీ లభించనుంది. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంట్లో చికిత్సకూ ఆరోగ్య బీమా

యాడ్‌ ఆన్‌ కవరేజీకి అనుమతి : ఐఆర్‌డీఏఐ


న్యూఢిల్లీ: ఇంటి వద్ద తీసుకునే వైద్య సేవలకూ ఇక ఆరోగ్య బీమా కవరేజీ లభించనుంది. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా పాలసీల్లో యాడ్‌ ఆన్‌ ఆప్షన్‌ కింద ఈ సదుపాయం కల్పించాలని బీమా సంస్థలను ఆదేశించింది. కొత్త ఆరోగ్య బీమా పాలసీ డాక్యుమెంట్లలో తప్పనిసరిగా ఈ ఆప్షన్‌ ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వ్యక్తులకూ యాడ్‌ ఆన్‌ కవరేజీ వర్తింప చేయవచ్చని తెలిపింది. కాకపోతే ఈ యాడ్‌ ఆన్‌ కవరేజీ కింద ఇంటి వద్ద వైద్య సేవలు తప్పనిసరిగా డాక్లర్ల పర్యవేక్షణలోనే జరగాలని స్పష్టం చేసింది. డాక్టర్‌ రోగి యొక్క రోజువారీ చికిత్సా వివరాలనూ రికార్డు చేయాలని తెలిపింది. ఆ రికార్డుల ఆధారంగానే క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ ఉంటుంది. ఈ యాడ్‌ ఆన్‌ కవరేజీతో  ఆస్పత్రుల్లో రూమ్‌ రెంట్‌, నర్సింగ్‌ ఫీజు వంటి భారీ ఖర్చులు తప్పుతాయని భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-23T09:19:03+05:30 IST