కరోనా చికిత్సకు ఆరోగ్య బీమా

ABN , First Publish Date - 2021-05-06T09:37:19+05:30 IST

గ్రూప్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న న్యాయవాదులందరికీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కరోనాకు నగదు రహిత సేవలు అందించేందుకు రక్ష థర్డ్‌ పార్టీ అడ్మిస్ట్రేటర్‌(టీపీఏ) హామీ ఇచ్చిందని బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా

కరోనా చికిత్సకు ఆరోగ్య బీమా

న్యాయవాదులకు నగదురహిత సేవలు

బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు 


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న న్యాయవాదులందరికీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కరోనాకు నగదు రహిత సేవలు అందించేందుకు రక్ష థర్డ్‌ పార్టీ అడ్మిస్ట్రేటర్‌(టీపీఏ) హామీ ఇచ్చిందని బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు. పాలసీ తీసుకున్నవారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రక్ష టీపీఏ సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ గోపిరాజు-9291486889, బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రయ్య-8179864207 లేదా తెలుగు కాల్‌ సెంటర్‌ 0866-2554323/2554324ని సంప్రదించవ చ్చని తెలిపారు. బీమా వర్తిస్తుందా లేదా అనే విషయంపై సందేహాలు నివృత్తి చేసేందుకు బార్‌ కౌన్సిల్‌ ఏర్పాట్లు చేసిందన్నారు. వివరాలకు అప్పిరెడ్డి-9000494227, సునీల్‌-9985168700, శ్యామ్‌ సుందర్‌- 8309589424 సంప్రదించవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-05-06T09:37:19+05:30 IST