ఆరోగ్య మౌలిక వసతుల్లో హైదరాబాద్‌ @ 5

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

ఆరోగ్య మౌలిక వసతుల్లో హైదరాబాద్‌ @ 5

ఆరోగ్య మౌలిక వసతుల్లో హైదరాబాద్‌ @ 5

న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణకు అవసరమైన మౌలిక వసతులు అత్యంత మెరుగ్గా ఉన్న ప్రధాన నగరాల్లో పుణె మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ అట్టడుగున ఉందని హౌసింగ్‌.కామ్‌ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి. చెన్నై, కోల్‌కతాకు 6,7 స్థానాలు దక్కాయి. ఈ నగరాల్లోని ఆసుపత్రి పడకల సంఖ్య, వాయు, నీటి నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్‌ కేటాయించినట్లు ఈ రియల్టీ పోర్టల్‌ తెలిపింది. 

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST