వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-06-27T22:28:07+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌సోరింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు డీఎంహెచ్‌వో కె.సునంద శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. స్టాఫ్‌నర్సు పోస్టులు 88,

వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌

ఏలూరు (పశ్చిమ గోదావరి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న  పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌సోరింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు డీఎంహెచ్‌వో కె.సునంద శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.  స్టాఫ్‌నర్సు పోస్టులు 88, ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రేడ్‌ -2) 22, ఫార్మాసిస్టు (గ్రేడ్‌-2) 18 భర్తీ చేస్తామన్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్టు విధానంలో ఉంటాయన్నారు. ఇక ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పీఎంవోవో రెండు పోస్టులు, రేడియోగ్రాఫర్‌ మూడు పోస్టులు, ఎంఎన్‌వో 28 పోస్టులు, ఎఫ్‌ఎన్‌వో 27 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈ నెల 27 నుంచి జూలై 22వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత సర్టిఫికెట్లు జత చేసి దరఖాస్తులను ఏలూరు లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజే యాలని సూచించారు. దరఖాస్తులను  వెబ్‌ సైట్‌ నుంచి పంపవచ్చన్నారు.

Updated Date - 2020-06-27T22:28:07+05:30 IST