హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణం నిలుపుదల చేయాలి

ABN , First Publish Date - 2022-08-17T06:54:39+05:30 IST

దొడ్డిగుంట గ్రామంలో డంపింగ్‌ యార్డు ప్రక్కన నిర్మిస్తున్న హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని దొడ్డికుంట గ్రామస్థులు మంగళవారం డిమాండ్‌ చేశారు.

హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణం నిలుపుదల చేయాలి

రంగంపేట, ఆగస్టు 16: దొడ్డిగుంట గ్రామంలో డంపింగ్‌ యార్డు ప్రక్కన నిర్మిస్తున్న హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని దొడ్డికుంట గ్రామస్థులు మంగళవారం డిమాండ్‌ చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టరుకు వినతిపత్రం పంపుతున్నట్టు తెలిపారు. తాము గ్రామంలో మెయిన్‌రోడ్‌ పక్కన మూడు స్థలాలు హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణానికి స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే కొందరు ఊరికి దూరంగా మట్టిరోడ్డు మాత్రమే ఉన్న చోట, డంపింగ్‌ యార్డు ప్రక్కన నిర్మిస్తున్నారన్నారు. వర్షం వస్తే అక్కడ పూర్తిగా ముంపునకు గురవుతుందన్నారు. అధికారులు స్పందించి గ్రామం నడిబొడ్డున ఉన్న స్థలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. హెల్త్‌ క్లినిక్‌ నిర్మిస్తున్న స్థలాన్ని పరిశీలించి నిర్మాణం నిలుపుదల చేయాలంటూ వినతిపత్రం అందిస్తామన్నారు. 


Updated Date - 2022-08-17T06:54:39+05:30 IST