Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెల్త్‌ సిటీగా ఓరుగల్లు

పూర్వ సెంట్రల్‌ జైలు స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.1100 కోట్లు
పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం
24 అంతస్తులతో భవనాల సముదాయం నిర్మాణం
ప్రజలకు అందుబాటులోకి రానున్న ఆధునిక వైద్యం
మాట నిలబెట్టుకున్న సీఎం


వరంగల్‌ / హనుమకొండ అర్బన్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): చారిత్రక వరంగల్‌ నగరం హెల్త్‌సిటీగా మారబోతోంది. దక్షిణభారత దేశంలోనే అతిపెద్ద వైద్యాలయాల సముదాయానికి కేరా్‌ఫగా నిలువబోతోంది. ఆధునిక వైద్యసదుపాయాలతో పాటు, ప్రపంచస్థాయి హంగులను కూడా సొంతం చేసుకోబోతోంది. వరంగల్‌ సెంట్రల్‌జైలు కూల్చివేత సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ సాకారం కాబోతోంది.  పూర్వ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.1100 కోట్ల నిధులు మంజూ రు చేస్తూ  రాష్ట్రప్రభుత్వం  పరిపాలన అనుమతులను ఇచ్చింది. ఈ మేరకు శనివారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ ఈ మేరకు జీవో నెంబర్‌ 158 జారీ చేశారు. ఈ మొత్తంలో సివిల్‌ వర్క్స్‌కు రూ.509కోట్లు, మంచినీరు, పారిశుధ్యపనుల కోసం రూ.20.36కోట్లు, మెకానికల్‌, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్‌ పనుల కోసం రూ.182.18కోట్లు, వైద్య పరికాల కోసం రూ.105కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54,28 కోట్లు, చట్టబద్దమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్లు నిర్దేశించారు. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ, డీఎం, రోడ్లు, భవనాల శాఖ  ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌, రాష్ట్ర వైద్య విద్యా డైరెక్టర్‌ ఆధ్వర్యంలో వెం టనే పనులు చేపట్టాలని రిజ్వీ ఆదేశించారు.  ఈ ఆస్పత్రి నిర్మాణంతో ఉమ్మ డి వరంగల్‌ జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. 24 అంతస్తులతో నిర్మించనున్న ఆస్పత్రి భవనం పై భాగాన హెలీప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. అత్యవసరమైన వైద్యసేవలను రోగులకు అందించడానికి స్పూపర్‌స్పెషాలిటీ డాక్టర్లును హైదరాబాద్‌, తదితర దూరప్రాంతాల నుంచి హెలీకాప్టర్‌లో తీసుకురావడానికి, అలాగే ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను ఆస్పత్రికి తరలించడానికి ఈ హెలీప్యాడ్‌ను ఉపయోగిస్తారు.  కేఎంసీ ఆవరణలో రూ.150 కోట్లతో నిర్మాణమైన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈ మెగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి తోడైతే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంత పెద్ద ఆస్పత్రి నిర్మాణం దక్షిణ భారత  దేశంలోనే ప్రథమం. మొత్తం 215 ఎకరాల్లో ఆధునిక వైద్య సేవలందించే హెల్త్‌సిటీ కొలువుదీరబోతోంది.

ఇక హైదరాబాద్‌ స్థాయిలో వైద్యం
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం నిధులుకూడా మంజూరు చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్య, వైద్య, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా ఉందన్నారు. వరంగల్‌ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీ్‌షరావు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సారథ్యంలో ఆస్పత్రి పనులు శరవేగంగా పూర్తికాగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి అయితే హైదరాబాద్‌ స్థాయిలో అద్భుతమైన రీతిలో వైద్యం ప్రజలకు అందుబాటులో రాగలదన్నారు.

సీఎంకు రుణపడి ఉంటాం..
- వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌

వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దడం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయని వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. వరంగల్‌లోని పూర్వ సెంట్రల్‌ జైలు స్థలంలో గత జూన్‌ 21న  మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.  ఇందులో భాగంగా భవన సముదాయ నిర్మాణానికి రూ.1100 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం  శనివారం ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.  నిధులు విడుదల చేసినందుకు వరంగల్‌ ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.  విభజిత వరంగల్‌ జిల్లాతో పాటు పూర్వ వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల ప్రజలకు  వైద్య సేవలందించేందుకు ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు.  అత్యాధునికమైన వసతులతో ఆస్పత్రి భవన సముదాయం వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలో నిర్మాణం అవుతుండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని నరేందర్‌ పేర్కొన్నారు.


Advertisement
Advertisement