Abn logo
Mar 20 2020 @ 02:53AM

మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు అందించాలి

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల రెగ్యులర్ సిబ్బందికి హెల్త్ కార్డులు అందించాలి. ఇతర  ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సేవలు అందుతున్నాయి. ఏపీ మోడల్ స్కూల్ సిబ్బందిని కూడా అదేవిధంగా ఆరోగ్య స్కీం పరిధిలోకి  తీసుకురావాలని ప్రభుత్వానికి  మోడల్ స్కూల్ టీచర్లు విన్నవిస్తున్నారు. ఇదివరకే హెల్త్ మేనేజ్మెంట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలి. ఎన్నో ఏళ్ళుగా సిబ్బంది చేస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల సిబ్బందిని కూడా హెల్త్ స్కీం పరిధిలోకి తీసుకురావాలి.

బి. సురేష్, శ్రీకాకుళం జిల్లాAdvertisement
Advertisement