మామిడి పండుతో ఇన్ని రకాల లాభాలా?

ABN , First Publish Date - 2022-04-23T17:26:25+05:30 IST

వేసవి వస్తే చాలు.. ఎవరికైనా మధురమైన మామిడి పండ్లే గురొస్తాయి. మామిడి పండ్లను రకరకాల రూపాల్లో తీసుకోవడం ద్వారా పోషకాలు అందేలా చూసుకోవచ్చు..

మామిడి పండుతో ఇన్ని రకాల లాభాలా?

ఆంధ్రజ్యోతి(23-04-2022)

వేసవి వస్తే చాలు.. ఎవరికైనా మధురమైన మామిడి పండ్లే గురొస్తాయి. మామిడి పండ్లను రకరకాల రూపాల్లో తీసుకోవడం ద్వారా పోషకాలు అందేలా చూసుకోవచ్చు.


మామిడిలో మైక్రోన్యూట్రిన్స్‌తో పాటు పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. మీ డైట్‌లో ఈ పండును చేర్చి తక్కువ మోతాదులో పలుసార్లు తినాలి. అలాగని మామిడితోనే మీ రోజును స్టార్ట్‌ చేయద్దు. ఏదైనా సరే అతిగా తింటే అనర్థమూ ఉంటుందనే విషయం మర్చిపోరాదు. ఈ పండును స్నాక్‌గా తీసుకోవాలి. కప్పు మామిడి పండు తింటే చాలు ఎనర్జీ బూస్టర్‌గా ఉపయోగపడతుంది. చాలా మంది మధ్యాహ్నం భోజనంతో కలిపి లేదా రాత్రిపూట డిన్నర్‌ చేసేప్పుడు మామిడి తింటారు. దీంతో పాటు లంచ్‌, డిన్నర్‌ తర్వాత కూడా ఈ పండును తింటుంటారు. ఇలా చేయటం మంచిది కాదు. మామిడి పండును రసం చేసుకుని తాగే బదులు.. మాగిన పండునే తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పండు తింటే కళ్లకు మంచిది. సులువుగా జీర్ణం అవుతుంది.


మామిడిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటితో పాటు సి-విటమిన్‌ అధికంగా ఉంటుంది కాబట్టి కొలెస్ర్టాల్‌ తగ్గుతుంది. దీని వల్ల బరువు తగ్గే అవకాశాలెక్కువ. క్రీడాకారులు, వర్కవుట్స్‌ చేసేవారు ఈ ఫలాన్ని ఆరగించితే మంచి ఫలితం ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం వీటికి ఉంది. మామిడిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల గుండెకు మంచిది. స్కిన్‌ క్లీనింగ్‌ చేసే లక్షణం ఉండటం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఎండాకాలంలో విరివిగా లభించే దీన్ని ‘సూపర్‌ ఫుడ్‌’ అని పిలుస్తారు. తిన్న వెంటనే శక్తితో పాటు ఫ్రెష్‌ ఫీల్‌ కలుగుతుంది.

Updated Date - 2022-04-23T17:26:25+05:30 IST