కరోనాతో హెడ్మాస్టర్ రమేశ్ మృతి.. చంద్రబాబు తీవ్ర ఆవేదన

ABN , First Publish Date - 2020-08-12T23:27:15+05:30 IST

కరోనా బాధితులకు వైద్య సాయం అందించడంలో జగన్ సర్కార్ విఫలమైందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు.

కరోనాతో హెడ్మాస్టర్ రమేశ్ మృతి.. చంద్రబాబు తీవ్ర ఆవేదన

అమరావతి: కరోనా బాధితులకు వైద్య సాయం అందించడంలో జగన్ సర్కార్ విఫలమైందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. కరోనా కారణంగా ఓ హెడ్మాస్టర్ చనిపోయిన విషయాన్ని ట్వీట్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురుదేవో భవః అని భావించే సమాజం మనదని చెబుతూ.. నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేశ్ కుమార్ కరోనాతో చనిపోయిన విషయాన్ని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనకు పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమంటూ ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఆ హెడ్మాస్టరును ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు. వైద్యం అందక రమేశ్ కన్నుమూశారని ట్విట్టర్‌లో తెలిపారు. ‘నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు. ఇదేనా మీ నాడు-నేడు? ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా? తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చింది. ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది. ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 



Updated Date - 2020-08-12T23:27:15+05:30 IST