Govt School Head Master: గవర్నమెంట్ స్కూల్ హెడ్మాస్టర్.. మరికొన్ని నెలల్లో రిటైర్.. 59 ఏళ్ల వయసులో ఇదేం పని..

ABN , First Publish Date - 2022-04-30T20:03:13+05:30 IST

ఆ పెద్దాయన వయసు 59 సంవత్సరాలు. గవర్నమెంట్ స్కూల్‌కు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచేదో, చెడేదో చెప్పాల్సిన..

Govt School Head Master: గవర్నమెంట్ స్కూల్ హెడ్మాస్టర్.. మరికొన్ని నెలల్లో రిటైర్.. 59 ఏళ్ల వయసులో ఇదేం పని..

ఆ పెద్దాయన వయసు 59 సంవత్సరాలు. గవర్నమెంట్ స్కూల్‌కు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచేదో, చెడేదో చెప్పాల్సిన ఆ ప్రబుద్ధుడి బుద్ధి గడ్డి కరిచింది. చివరకు పోలీసులు ఆ పెద్దాయనను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టేంతవరకూ పరిస్థితి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా ఎస్పీ ఆఫీస్ నాగర్‌కోయిల్‌లో ఉంది. ఆ ఆఫీస్ ఎదురే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ హెడ్మాస్టర్‌గా నిత్యా లక్ష్మణ్‌వేల్(59) అనే వ్యక్తి విధులు నిర్వర్తిస్తున్నాడు.


 

విద్యార్థినీవిద్యార్థులకు విచక్షణ, క్రమశిక్షణ అంటే ఏంటో తెలియజెప్పాల్సిన ఈ ప్రధానోపాధ్యాయుడు పెడతోవ పట్టాడు. 59 ఏళ్ల వయసులో విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులతో వెకిలిగా ప్రవర్తించాడు. వెకిలి మాటలతో, వ్యవహార శైలితో వారిని ఇబ్బంది పెడుతూ కావాలని ఒళ్లంతా తడుముతూ తప్పుడు వేషాలు వేశాడు. ఏదో ఒక వంకతో తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇతని వేధింపులు భరించలేకపోయిన బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో విషయం చెప్పారు. అలా ఈ బుర్రాబుద్ధి లేని హెడ్మాస్టర్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు Child Protection Office and Childline No. 1098కి కాల్ చేసి ఈ కీచక ప్రధానోపాధ్యాయుడు నిత్యా లక్ష్మణ్‌వేల్‌పై ఫిర్యాదు చేశారు.



Child Welfare Officer షకీలా భాను ఈ ఘటనపై విచారణ జరిపారు. నిత్యా లక్ష్మణ్‌వేల్ వ్యవహారంపై ఆరా తీశారు. పోలీసుల విచారణలో ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులతో ఈ ప్రబుద్ధుడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. పోలీసులు ఈ హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కన్నబిడ్డలు కూడా అసహ్యించుకునే పనిచేసిన ఈ కీచకుడిని కఠినంగా శిక్షించాలని బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిత్యా లక్ష్మణ్‌వేల్ నాగర్‌కోయిల్‌లోని ఇరులప్పురం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్‌గా గత మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న నిత్యా లక్ష్మణ్‌వేల్‌ను విధుల్లో నుంచి తొలగిస్తూ ప్రాథమిక విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యా లక్ష్మణ్ మరికొన్ని నెలల్లో రిటైర్ కాబోతుండగా అతని కామ చేష్టల వల్ల పరువు పోగొట్టుకుని జైలు పాలయ్యాడు.

Updated Date - 2022-04-30T20:03:13+05:30 IST