ప్రధానోపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థి వీపుపై వాతలు.. ఎందుకు కొట్టారని అడిగితే...

ABN , First Publish Date - 2021-11-25T06:30:44+05:30 IST

ప్రధానోపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థి వీపుపై వాతలు.. ఎందుకు కొట్టారని అడిగితే...

ప్రధానోపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థి వీపుపై వాతలు.. ఎందుకు కొట్టారని అడిగితే...
స్కూల్‌ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

భోజనం చేస్తున్న విద్యార్థిని చితకబాదిన వైనం 

దేచుపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఘటన

స్కూల్‌ను ముట్టడించిన తల్లిదండ్రులు

జగ్గయ్యపేట/వత్సవాయి, నవంబరు 24 : దేచుపాలెం మండల పరిషత్‌ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అకారణంగా విద్యార్థులను దండిస్తున్నందుకు నిరసనగా బుధవారం తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న నాల్గో తరగతి విద్యార్థి ఉదయభార్గవ్‌, ఒకటో తరగతి చదువుతున్న జెస్సీలు తోటి విద్యార్థితో మాట్లాడుతున్నారనే నెపంతో బెత్తంతో విపరీ తంగా కొట్టడంతో వీపుపై వాతలు తేలాయి. అక్కడకు వచ్చిన ఓ మహిళ అదేమని ప్రశ్నిస్తే, దురుసుగా మాట్లాడటంతో ఆమె బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. వారంతా వచ్చి ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, మరుగుదొడ్లను వినియోగించుకోనివ్వటం లేదని, బాత్‌రూమ్‌కు ఇంటికే వెళ్లమని పంపుతున్నారని  ఆరోపించారు. యూనిఫాంలు, పుస్తకాలు ఇవ్వట్లేదని  ఫిర్యాదు చేసిన పిల్లలను వేధిస్తున్నా రని మండిపడ్డారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో  టీచర్‌ పనిచేస్తుందని, ఇద్దరిలో ఎవరో ఒకరే వస్తుంటారని చెప్పారు. ప్రధానోపాధ్యాయుడి వివరణకు యత్నించగా, నిరాకరించారు. మండల విద్యాశాఖాధికారి నాగరాజును   వివరణ కోరగా, సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు.




Updated Date - 2021-11-25T06:30:44+05:30 IST