హెడ్లెస్‌ లైన్‌

ABN , First Publish Date - 2021-07-12T05:54:15+05:30 IST

వాడు రైలెక్కాడు సీతాకోక చిలుకని వెంబడిస్తూ ఎవడికేం పట్టింది రైలెక్కాడా దాని కింద పడ్డాడా...

హెడ్లెస్‌ లైన్‌

వాడు రైలెక్కాడు 

సీతాకోక చిలుకని వెంబడిస్తూ  


ఎవడికేం పట్టింది  

రైలెక్కాడా దాని కింద పడ్డాడా 

వాడేమైనా ఓ చక్కని తల్లి అల్లిన లేసు పువ్వా 

దారికి కాచాడు దారనుకుని రైలెక్కాడు 


రైలేమో తిరుగుడు పువ్వాయె

దాని పరుగు ప్లాట్‌ ఫారం వరకే  

కొన్ని కలలు మెలుకువ వరకే 


దిగుతూనే maze...

maze... నిండా ఎలుక లుక లుక లే 

maze... maze... sodo..mice.. mice... 

ఎగరబోయి ఎలుకల గుంపులో బాలుని ముంపు 

ఏ పేపర్‌లోనూ పడని హెడ్లెస్‌ లైన్‌


ఎలుకల ఆకటి పోరు 

అడ్డాలు పంచుకున్న 

పందికొక్కుల గుప్పిట ఆటే 

ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఏరాల్సిందే  

పారిజాతాలు రాలాల్సిందే

విసిరిన విస్తరి దేవులాడాల్సిందే

పసి రెక్కలు తెగాల్సిందే 

ఒడుపుగ పోకెట్‌ పిక్‌ చెయ్యాల్సిందే  

ఒంటిపై లాఠీ వాతలు తేలాల్సిందే 

మొలిచిన కలలు కాలాల్సిందే     

కలుగుల్లో కమలాల్సిందే 

పునాదులు కూలాల్సిందే 


గుప్పెడు మెతుకులే గురి 

క్షణ క్షణం చావడమే బతుకు బడి  

బతుకు వధ్య శిలపై 

బాల్యనికి మేకు దిగ్గొట్టాక కూడా  


ఆటలాడాల్సిందే....

విప్పగుంట రామ మనోహర


Updated Date - 2021-07-12T05:54:15+05:30 IST