ITBPలో హెడ్‌ కానిస్టేబుల్స్‌

ABN , First Publish Date - 2022-10-04T23:22:09+05:30 IST

ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ)... గ్రూప్-సి విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌(ఎడ్యుకేషన్‌ అండ్‌ స్ట్రెస్‌ కౌన్సెలర్‌) ఖాళీల నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

ITBPలో హెడ్‌ కానిస్టేబుల్స్‌

ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ)... గ్రూప్-సి విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ (ఎడ్యుకేషన్‌ అండ్‌ స్ట్రెస్‌ కౌన్సెలర్‌) ఖాళీల నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23(పురుషులు-20, మహిళలు-03)

అర్హత: డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత

వయోపరిమితి: 2022 నవంబరు 11 నాటికి 20  నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రివ్యూ మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబరు 13

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 11

వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/

Updated Date - 2022-10-04T23:22:09+05:30 IST