హెడ్ కానిస్టేబుల్ దంపతులకు కరోనా...

ABN , First Publish Date - 2020-04-05T15:39:06+05:30 IST

హెడ్ కానిస్టేబుల్ దంపతులకు కరోనా వైరస్ సోకిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది....

హెడ్ కానిస్టేబుల్ దంపతులకు కరోనా...

పోలీసు క్యాంపు భవనానికి సీలు

ముంబై : హెడ్ కానిస్టేబుల్ దంపతులకు కరోనా వైరస్ సోకిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. ముంబై ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ పోలీసు బ్రాంచ్‌లో 57 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్, అతని భార్యకు కరోనా వైరస్ సోకడంతో వారిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. ముంబై నగరంలోని వర్లీ పోలీసు క్యాంపునకు చెందిన హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యంతో సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చేరారు. అతనికి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షించగా కరోనా ఉందని తేలడంతో అతన్ని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు.


అనంతరం అతని భార్యను కూడా పరీక్షించగా ఆమెకు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది.దీంతో కానిస్టేబుల్ దంపతులను ఆసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ పిల్లలను హోంక్వారంటైన్ చేసి వర్లీ పోలీసక్యాంపు భవనానికి సీలు వేశారు. హెడ్ కానిస్టేబుల్ భూమి గురించి లోనావాలా వెళ్లి వచ్చారని, అనంతరం సియాన్ ఆసుపత్రిలో సోదరుడిని చూసేందుకు వెళ్లారని డాక్టర్ల పరిశీలనలో తేలింది. హాస్పిటల్ వెళ్లినపుడే హెడ్ కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకిందని వైద్యాధికారుల పరిశీలనలో వెల్లడైంది. 

Updated Date - 2020-04-05T15:39:06+05:30 IST