పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్‌ చేశారు

ABN , First Publish Date - 2022-05-20T04:43:06+05:30 IST

పోలీసులు తమను దౌర్జన్యంగా అరెస్టు చేశారని బీజేపి జిల్లా అధ్య క్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18సంవత్సరాలుగా వంతె నను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే అనుమతి పేరిట అరెస్టు చేశారన్నారు. డీఎస్పీతో మాట్లాతుండగానే టీఆర్‌ఎస్‌నాయకులు తన వాహనం అద్దాలు పగులగొట్టారని పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అన్నారు. కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు

పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్‌ చేశారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 19: పోలీసులు తమను దౌర్జన్యంగా అరెస్టు చేశారని బీజేపి జిల్లా అధ్య క్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18సంవత్సరాలుగా వంతె నను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే అనుమతి పేరిట అరెస్టు చేశారన్నారు. డీఎస్పీతో మాట్లాతుండగానే టీఆర్‌ఎస్‌నాయకులు తన వాహనం అద్దాలు పగులగొట్టారని పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అన్నారు. కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు కొంగసత్యనారాయణ, ఆత్మారాంనాయక్‌, పాల్వాయి హరీశ్‌బాబు సొల్లు లక్ష్మి, సుహాసిని, విజయ్‌సింగ్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు: మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. పెద్దవాగు వద్ద దీక్ష చేపట్టేందుకు వెళ్లగా టీఆర్‌ఎస్‌ నాయ కులు తమపై దాడికి పాల్పడడం సిగ్గు చేటన్నారు.

Updated Date - 2022-05-20T04:43:06+05:30 IST