షేరు ధర 73 శాతం పెరిగినా... 310 కోట్ల డాలర్ల షేర్లను అమ్మేశాడు... ఎందుకంటే ?

ABN , First Publish Date - 2020-08-07T18:42:16+05:30 IST

ఈ-కామర్స్’ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్... కంపెనీలో తన వాటాగా ఉన్న 310 కోట్ల డాలర్ల(3.1 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించాడు. గత ఏడాది విక్రయించిన మొత్తం షేర్ల కంటే ఈసారి ఎక్కువగా విక్రయించాడు. ఫైలింగ్ ప్రకారం... ఈ ఏడాది జెఫ్ బెజోస్... కంపెనీలో 4.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. తాజా స్టేక్ సేల్‌తో కలిపి ఆయన ఈ ఏడాదిలో విక్రయించిన మొత్తం షేర్ల విలువ 7.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

షేరు ధర 73 శాతం పెరిగినా... 310 కోట్ల డాలర్ల షేర్లను అమ్మేశాడు... ఎందుకంటే ?

సియాటిల్ : ‘ఈ-కామర్స్’ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్... కంపెనీలో తన వాటాగా ఉన్న 310 కోట్ల డాలర్ల(3.1 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించాడు. గత ఏడాది విక్రయించిన మొత్తం షేర్ల కంటే ఈసారి ఎక్కువగా విక్రయించాడు. ఫైలింగ్ ప్రకారం... ఈ ఏడాది జెఫ్ బెజోస్... కంపెనీలో 4.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. తాజా స్టేక్ సేల్‌తో కలిపి ఆయన ఈ ఏడాదిలో విక్రయించిన మొత్తం షేర్ల విలువ 7.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 


భారీఎత్తున షేర్లను విక్రయించినప్పటికీ జెఫ్ బెజోస్ వద్ద ఇప్పటికీ 54 మిలియన్ల షేర్లు ఉండడం గమనార్హం. వీటి విలువ... 170 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం అతనిని ప్రపంచ కుబేరునిగా నిలబెడుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ-కామర్స్‌కు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది కంపెనీ షేర్ల విలువ ఏకంగా 73 శాతం పెరిగిపోయింది.


ఆగస్ట్ తొలి రెండు పనిదినాల్లో ఒక మిలియన్ షేర్లను విక్రయించాడు బెజోస్. తన రాకెట్ సంస్థ బ్లూఆరిజన్‌కు నిధులను సమీకరించేందుకు ప్రతీ ఏడాది ఒక బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిపాడు. 


Updated Date - 2020-08-07T18:42:16+05:30 IST