130కోట్ల మంది భారతీయుల్లో.. ట్రంప్ మెచ్చిన వన్ అండ్ ఒన్లీ ఇండియన్ ఇతనే..

ABN , First Publish Date - 2020-02-21T23:34:03+05:30 IST

తనదైన శైలిలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు సొంతవాళ్లను కూడా విస్మయానికి గురి చేస్తుంటాయి. అలాంటి ట్రంప్‌ను ఇంప్రెస్ చేసిన భారత వ్యక్తి ఒకరు ఉన్నారు.

130కోట్ల మంది భారతీయుల్లో.. ట్రంప్ మెచ్చిన వన్ అండ్ ఒన్లీ ఇండియన్ ఇతనే..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏం చేసినా, ఏది మాట్లాడినా సంచలనమే. తనదైన శైలిలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు సొంతవాళ్లను కూడా విస్మయానికి గురి చేస్తుంటాయి. అలాంటి ట్రంప్‌ను ఇంప్రెస్ చేసిన భారత వ్యక్తి ఒకరు ఉన్నారు. 130కోట్ల మంది భారతీయుల్లో ఈ వన్ అండ్ ఒన్లీ ఇండియన్ మాత్రం ట్రంప్ మనసు గెలిచాడు. ఎంతలా అంటే ట్రంప్ స్వయంగా అతని గురించి సామాజిక మాద్యమాల్లో 'కోట్లాది మంది భారతీయులలో నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం.. నిన్ను త్వరలో కలుస్తాను' అంటూ ప్రకటించారు. ఇంతకీ ఆ భారతీయుడు ఎవరు.. ఎక్కడ ఉంటాడు.. ఏం చేస్తుంటాడు.. ట్రంప్ అంతగా మెచ్చుకునే పని అతను ఏం చేశాడు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ట్రంప్‌ మనసు గెలిచిన ఆ వ్యక్తి ఎక్కడో వేరే రాష్ట్రంలో లేడు. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నాడు. అతను ఎవరో కాదు తెలంగాలోని జనగామ జిల్లా బచ్చన్న పేటలోని కొన్నే గ్రామం వాసి కృష్ణ. అందరూ అతడిని ముద్దుగా క్రిష్ అని పిలుస్తుంటారు. ట్రంప్ వీరాభిమాని అయిన క్రిష్ తన ఇంటి వద్ద ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడి గుడి కట్టేశాడు. అంతటితో ఆగకుండా గుడిలోని ట్రంప్ విగ్రహానికి డైలీ పూజలు చేస్తున్నాడు.



ఇలా తనపై వీరాభిమానాన్ని చూపిస్తున్న క్రిష్ గురించి తెలుసుకున్న ట్రంప్.. అతడిని కలవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని గతంలో సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే, ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్రిష్ మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ఈ సందర్భంగా ట్రంప్‌కు గుడి కట్టడానికి నిన్ను అంతగా ఆకర్షించిన విషయం ఏమిటని క్రిష్‌ను ప్రశ్నిస్తే... ట్రంప్ ముక్కు సూటి తనం.. ఆయన వ్యవహార శైలి అని చెప్పుకొచ్చాడు. అందుకే అధ్యక్షుడికి ఆలయం నిర్మించానని అంటున్నాడు.


ఇక ఈ గుడిలోని ట్రంప్ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తుంటాడు. జీవితంలో ఒకసారి అయిన ట్రంప్‌ను కలవాలని పరితపిస్తూ ఉంటాడని క్రిష్ సన్నిహితులు చెబుతుంటారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిన ఒక్కసారైనా కలుసుకుని మాట్లాడాలనేది తన కోరిక అంటాడు క్రిష్. అయితే గతంలో క్రిష్ గురించి తెలిసినప్పుడు భారత్ వస్తే.. కలుస్తానని ప్రెసిడెంట్ మాట ఇచ్చిన నేపథ్యంలో తాజా ట్రంప్ పర్యటనపై క్రిష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన ఆరాధ్య దైవాన్ని కలుసుకునే అవకాశం తప్పకుండా తనకు వస్తుందని క్రిష్ పేర్కొన్నాడు. అతని ఆశ నెరవేరాలని కోరుకుందాం. 

Updated Date - 2020-02-21T23:34:03+05:30 IST