Jun 18 2021 @ 18:41PM

ఆయన నా లవర్‌ కాదు.. బ్రదర్‌: అమలాపాల్‌

‘మైనా’ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్‌ అమలాపాల్‌. అలాగే, ‘దైవతిరుమగన్‌’ అనే చిత్రంతో పాటు పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ఇద్దరూ ఓ చిత్రం షూటింగ్‌ సమయంలో ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ, మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత స్వేచ్ఛాజీవిగా మారిన అమలాపాల్‌ గ్లామర్‌ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ క్రమంలో ‘ఆడై’ అనే చిత్రంలో 16 రోజుల పాటు న్యూడ్‌గానే నటించింది. 


అంతేకాకుండా, ‘పిట్టకథలు’ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా ఆమె న్యూడ్‌గా నటించినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ వ్యక్తి తొడపై కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో అమలాపాల్‌ కొత్త వ్యక్తితో ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆయన తన లవర్‌ కాదని, సోదరుడు అంటూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ఆమె చేసిన పోస్ట్‌లో కూడా అమలాపాల్‌ ఈ విషయాన్ని ప్రస్తావించింది. కానీ.. ఆమెకున్న ట్రాక్‌ రికార్డ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఎవరూ నమ్మకపోవడంతో.. మరోసారి బలంగా ఆమె బదులిచ్చింది.