ఓరియంట్ సిమెంట్‌ కంపెనీ స్టాక్‌ వైపు... హెచ్‌డీఎఫ్‌సీ దృష్టి

ABN , First Publish Date - 2021-08-05T22:18:33+05:30 IST

ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్ట్‌పోలియోలోని కంపెనీలకు మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఓరియంట్ సిమెంట్‌ కంపెనీ స్టాక్‌ వైపు... హెచ్‌డీఎఫ్‌సీ దృష్టి

హైదరాబాద్ :  ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్ట్‌పోలియోలోని కంపెనీలకు మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇదే నేపధ్యంలో... బ్రోకరేజ్, పరిశోధనా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్...  రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్ట్‌ఫోలియోలో భాగమైన ఓరియంట్ సిమెంట్‌ కంపెనీపై 'బై' రేటింగ్‌ను కొనసాగించింది. కంపెనీ బీఎస్‌ఈ షేర్‌హోల్డింగ్ నమూనా ప్రకారం... జూన్ 2021 త్రైమాసికం నాటికి బిగ్‌బుల్‌కు ఆ కంపెనీలో 1.22 % వాటా ఉంది.


ఓరియంట్ సిమెంట్ షేర్లు ఒక సంవత్సరంలో వేగంగా పరుగులు తీసి 140 శాతానికి పైగా పెరగడం విశేషం.   ఇదే క్రమంలో... ఈ సంవత్సరం ఇప్పటికే 80 % కంటే ఎక్కువగా పెరగడం గమనార్హం. మార్కెట్‌లో దీని ప్రీమియం అమ్మకాల వాటా దాని ట్రేడ్ అమ్మకాలలో 15 నుంచి 18 శాతానికి పెరిగింది. ధరల పెరుగుదలకు ముందు బొగ్గును నిల్వ చేయడం ద్వారా ఓరియంట్ ఇంధన ద్రవ్యోల్బణం నుంచి ద్వితీయ త్రైమాసికంలో బయటపడగలిగింది.

Updated Date - 2021-08-05T22:18:33+05:30 IST