కొత్త ఫండ్స్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2021-06-21T08:49:44+05:30 IST

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేరిట కొత్త ఫండ్‌ను ప్రారంభించింది.

కొత్త ఫండ్స్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేరిట కొత్త ఫండ్‌ను ప్రారంభించింది. ఈ ఫండ్‌ ఈ నెల 25న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000.  ఇష్యూ ద్వారా సేకరించే నిధులను బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీల్లో ఈక్విటీ, ఈక్విటీ అనుసంధానిత పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. 


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌: దేశంలోని పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ పేరిట కొత్త ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫండ్‌ జూన్‌ 28న ప్రారంభమై జూలై 12న ముగుస్తుంది. కనీస పెట్టుబడి పరిమితి రూ.5,000. ఫండ్‌ ద్వారా సేకరించే నిధులను లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. 

Updated Date - 2021-06-21T08:49:44+05:30 IST