వర్సిటీల ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా

ABN , First Publish Date - 2021-03-05T08:49:41+05:30 IST

క్వాక్వారేలి సైమండ్స్‌ (క్యూఎస్‌) ప్రపంచ యూనివర్సిటీ సబ్జెక్టు ర్యాంకిం గ్స్‌ 2021లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)

వర్సిటీల ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా

రాయదుర్గం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): క్వాక్వారేలి సైమండ్స్‌ (క్యూఎస్‌) ప్రపంచ యూనివర్సిటీ సబ్జెక్టు ర్యాంకిం గ్స్‌ 2021లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సత్తా చాటింది. ఇంగ్లిష్‌ విభాగంలో టాప్‌ 300 ర్యాంకుల్లో హెచ్‌సీయూ చోటు దక్కించుకుంది. అలాగే రసాయనశాస్త్రం విభాగంలో టాప్‌ 351 నుంచి 400 ర్యాంకుల్లో, లైఫ్‌ సైన్సె్‌సలో 501-550, భౌతికశాస్త్రంలో 551-600వ ర్యాంకుల్లో నిలిచింది. ఈ ర్యాంకింగులను కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం విడుదల చేశారు.


ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో 1,440 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 14 వేల వర్సిటీల కార్యక్రమాలను విశ్లేషించి ప్రతి వర్సిటీని నాలుగు సూచీల ద్వారా అంచనా వేశామని తెలిపారు. హెచ్‌సీయూ యాజమాన్యానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్త వర్సిటీల్లో తమ వర్సిటీ ర్యాంకులు సాధించడంపై హెచ్‌సీయూ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. క్యూఎస్‌ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగులను క్వాక్వారేలీ సైమండ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఏటా ప్రచురిస్తుంది.


Updated Date - 2021-03-05T08:49:41+05:30 IST